SVBC PLAYING KEY ROLE IN THE SPREAD OF ANCIENT KNOWLEDGE-SCHOLARS _ భారతీయ జ్ఞాన పరంపర కొనసాగించాలి
Tirupati,06 July 2024: Acharya Krishna Murty, the Vice Chancellor of National Sanskrit University said on Saturday that the Sri Venkateswara Bhakti Channel is successfully playing a key role in spreading the ancient Hindu Santana Dharmic knowledge across the globe through a series of programs.
Participating in the 16th Anniversary of the SVBC, the VC complimented the channel for conceiving attractive religious programs to devotees which included from Suprabatham to Ekantha Seva at the Srivari temple.
The program Sanskritam Nerchukundam jointly produced by the university and the TTD has become very popular among Sanskrit lovers and beginners.
Acharya Rani Sadasiva Murti, the VC of SV Vedic University said the programs of SVBC are being followed by Srivari devotees spread across the globe.
SVBC CEO Sri Shanmukh Kumar highlighted various innovative religious programs telecast by the SVBC and the huge following by devotees. Besides he also highlighted on the popularity of SVBC YouTube and online Radio.
Thereafter prizes were distributed to the winners of several competitions held for the employees of SVBC as a part of the anniversary celebrations on the occasion. The event commenced after offering prayers to the idol of Sri Venkateswara Swamy in the SVBC office premises in Tirupati on Saturday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భారతీయ జ్ఞాన పరంపర కొనసాగించాలి
• జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విసి ఆచార్య కృష్ణమూర్తి
తిరుపతి, 2024 జూలై 06: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భారతీయ విజ్ఞాన పరంపర కొనసాగించాలని, మన పూర్వికులు మనకు అందించిన జ్ఞానాన్ని ప్రచారంలోకి తీసుకురావాలంటే ఎస్వీబీసీ ద్వారా మాత్రమే సాధ్యమని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విసి ఆచార్య కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎస్వీబీసీ 16వ వార్షికోత్సవం శనివారం తిరుపతిలోని ఛానల్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆచార్య కృష్ణమూర్తి మాట్లాడుతూ, భక్తులను ఆకట్టుకునేలా చక్కటి కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేస్తున్న ఎస్వీబీసీకి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు నిర్వహించే అన్ని సేవలు, ఉత్సవాలను భక్తులకు అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత విశ్వవిద్యాలయం ఎస్వీబీసీతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశాయని, ఇందులో “సంస్కృతం నేర్చుకుందాం” అనే కార్యక్రమం విశేషాదరణ పొందిందని ఆయన వివరించారు.
అనంతరం ఎస్వీ వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, ఎస్వీబీసీ పురాణాలు, భౌగోళిక, భక్తి, మోక్ష సంబంధిత విశేషాలు ప్రపంచానికి అందిస్తుందన్నారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య, వార, మాస, పక్ష, వార్షిక పూజలు, ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లోని భక్తులు ఎస్వీబీసీ ద్వారా వీక్షిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు భక్తిమార్గంలో ఛానల్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్నారని చెప్పారు.
ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్ మాట్లాడుతూ, ఎస్వీబీసీ ద్వారా ప్రసారం అయిన సుందరకాండ, భగవద్గీత లాంటి పారాయణాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయన్నారు. తద్వారా ఛానల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు పెరిగారని, ఎస్వీబీసీ యూట్యూబ్, ఆన్‌లైన్ రేడియో కూడా భక్తుల ఆదరణ పొందుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రూపొందించనున్న కార్యక్రమాలను వివరించారు.
అనంతరం వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో ఎస్వీబీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.