PROTECT DESI COWS FOR FUTURE GENERATIONS -TTD BOARD MEMBER _ భావితరాలకు గో ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి – శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘ‌నంగా గో పూజ‌ – టిటిడి ధర్మకర్తలు ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్

Tirupati, 16 Jan. 22: There is every need to save the cows and especially enhance Desi breeds for the sake of future generations, said TTD Trust Board member Sri Pokala Ashok Kumar.

The Kanuma festivities took place in SV Dairy Farm in Tirupati on Sunday. Speaking on the auspicious occasion he said, TTD has taken up various Go Samrakshana programmes in recent times to protect cows including Gudiko Gomata, Goadharita Vyavasayam, Govinduniki Goadharita Naivedyam, Go Puja in every temple, Panchagavya Products, Navaneeta Seva, Go Mandiram at Alipiri, development of research centre at Palamaner Gosala and many more. He called upon everyone to know about the significance of Gomata in Hindu Sanatana Dharma and take oath to protect cows.

CVSO Sri Gopinath Jatti said Go puja on Kanuma is one of the most ancient festivities in India. He urged everyone not to forget the roots of our Dharma while marching ahead in Tech-savvy world.

Earlier special pujas were performed to Sri Venugopala Swamy followed by Go puja Mahotsavam. The entire premises was spruced up in a traditional manner to match the occasion.

Gosala Director Dr Harnath Reddy and other staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

భావితరాలకు గో ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘ‌నంగా గో పూజ‌ – టిటిడి ధర్మకర్తలు ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్

తిరుపతి, 2022 జ‌న‌వ‌రి 16: భావితరాలకు గో ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ పిలుపునిచ్చారు.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆదివారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు టీటీడీ ఉచితంగా ఎద్దులను అందిస్తున్నట్లు చెప్పారు. గోవు నుండి లభించే పంచగవ్యలను గుర్తించి, దేశ విదేశాల్లోని ప్రజలందరూ గోవులను రక్షించుకోవడం ద్వారా ఆయురారోగ్యాలతో ఉంటారని వివరించారు.

టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ వందలాది సంవత్సరాలుగా గోవులకు కనుమ పండుగ రోజు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఆధునిక యుగంలో గో ప్రాశస్త్యాన్ని మరిచిపోతున్నారని, దాన్ని తెలియజేసేందుకు టీటీడీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల గో మహా సమ్మేళనం నిర్వహించిందని, దీనికి దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు హాజరై గోవు ప్రాముఖ్యతను వివరించారని చెప్పారు.

అంతకుముందు గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజ చేశారు. అటుతర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు. ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

గోశాల సంచాలకులు శ్రీ హరినాథ్ రెడ్డి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.