SOMASKANDAMURTHY RIDES BHUTA VAHANA _ భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

Tirupati, 6 Mar. 21: On the third day of the ongoing annual Brahmotsavam of Sri Kapileswara temple, Sri Somaskandamurthy along with His consort Sri Kamakshi Ammavaru took a celestial ride on Bhuta Vahana on Saturday.

TTD is organising the Brahmotsavam in Ekantham in view of Covid guidelines.

DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Temple inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Nayak, temple Archakas were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

తిరుపతి, 2021 మార్చి 05: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శ‌నివారం  ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూత వాహనంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో  ఏకాంతంగా నిర్వ‌హించారు.

పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.