ELEVENTH PHASE SUNDARAKANDA AKHANDA PATHANAM HELD _ భ‌క్తిభావాన్ని పంచిన 11వ విడ‌త సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 18 March 2021: The Eleventh phase of Akhanda Sundarakanda Pathanam held with religious fervour amidst devotees chanting the divine 156 shlokas from four chapters at Nada Neerajana Mandapam in Tirumala on Thursday.

SVBC telecasted the Parayanam live between 7am and 9am for the sake of global devotees. In the 11th phase, Shlokas from 45 to 48 Chapters from Sundarakanda were recited under the guidance of Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, Vedic scholars Sri Pavana Kumara Sharma and Sri Ramanujacharyulu. 

Nearly 200 Vedic scholars from Dharmagiri Veda Vignana Peethama, SV Vedic University, National Sanskrit Varsity, SV Higher Vedic Studies, and Veda Parayanamdars took part in this mass recitation of Sundarakanda.

The programme commenced with Rama Kodanda Rama song and concluded with Sri Hanuman Jaya Hanumam song rendered in a melodious manner by the artistes. 

Special Officer Sri AV Dharma Reddy, National Sanskrit Varsity VC Sri Muralidhara Sharma, Annamacharya Project Director Sri Dakshinamurthy, DyEOs Sri Lokanatham, Sri Nagaraja, Health Officer Dr RR Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

భ‌క్తిభావాన్ని పంచిన 11వ విడ‌త సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2021 మార్చి 18: తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురువారం ఉద‌యం జ‌రిగిన 11వ విడ‌త సుందరకాండ అఖండ పారాయ‌ణం ఆద్యంతం భ‌క్తిభావాన్ని పంచింది. ఈ సంద‌ర్భంగా పండితులు 45వ సర్గ నుంచి 48వ సర్గ వరకు ఉన్న 156 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ పారాయ‌ణంలో భక్తులు తమ ఇళ్ల నుంచే పాల్గొన్నారు.

విశ్వంలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని, కోవిడ్ – 19 వ్యాధిని అరికట్టాలని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వ‌హిస్తున్న‌ పారాయణ యజ్ఞంలో భాగంగా మంత్ర పారాయణం ప్రారంభించి 343 రోజులు పూర్తి కాగా, సుందరకాండ పారాయ‌ణానికి 281 రోజులు పూర్త‌య్యాయి.

సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గ‌ల్లో గ‌ల 2,821 శ్లోకాల‌ను మొత్తం 16 విడ‌త‌లుగా అఖండ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు. టిటిడి ఇప్పటివరకు 10 విడ‌త‌లుగా సుందరకాండ అఖండ పారాయ‌ణం చేప‌ట్టింది.

11వ‌ విడ‌త‌ అఖండ పారాయ‌ణంలోని 156 శ్లోకాలను శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని, శ్రీ ప‌వ‌న‌‌కుమార‌ శ‌ర్మ‌, శ్రీ రామానుజాచార్యులు పారాయ‌ణం చేశారు. విజ‌య‌వాడ‌కు చెందిన సంగీత విద్వాంసులు శ్రీ రాణి శ్రీ‌నివాస‌శ‌ర్మ బృందం “రామా కోదండ‌రామా…,” సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుడు శ్రీ బి.ర‌ఘునాథ్ బృందం “శ్రీ హ‌నుమా జ‌య‌హ‌నుమా…” సంకీర్తనతో ముగించారు.

ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు కలిపి దాదాపు 200 మంది పాల్గొన్నా‌రు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటీ ఉప కుల‌ప‌తి ఆచార్య మురళీధరశర్మ, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఆర్ఆర్‌.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ నాగ‌రాజ‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్ర‌త్యేకాధికారి డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.