APPEAL TO DEVOTEES _ భ‌క్తుల‌కు టిటిడి విజ్ఞ‌ప్తి

Tirumala, 8 Jan. 22: TTD has appealed to devotees who had rescheduled their darshan dates not to choose from January 13 to 22 owing to Vaikunta Dwara Darshanam.

It may be mentioned here, TTD has provided rescheduling of darshan dates facility to devotees who booked darshan from November 18 to December 10 and could not able to make it for darshan in spite of having valid darshan tickets due to inclement weather conditions.

However, TTD stated the devotees shall choose dates other than the above mentioned dates for their darshan and co-operate with TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భ‌క్తుల‌కు టిటిడి విజ్ఞ‌ప్తి

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 08: గ‌త ఏడాది భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌వంబ‌రు 18 నుండి డిసెంబ‌రు 10వ తేదీ వ‌ర‌కు ద‌ర్శ‌నం టికెట్లు క‌లిగి ద‌ర్శ‌నం చేసుకోలేక‌పోయిన భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు టిటిడి వారికి ఆరు నెల‌ల్లోపు స్వామివారి ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది.

అయితే తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ఉన్న వైకుంఠ ద్వార దర్శనం కారణంగా, ఈ తేదీలు మిన‌హాయించి వారు మ‌రి ఏ తేదీల్లోనైనా శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు. కావున భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీ కి సహకరించగ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.