భక్తులకు విజ్ఞప్తి
భక్తులకు విజ్ఞప్తి
తిరుపతి, జూలై, 26: ఈనెల 12వ తేదిన వివిధ దినపత్రికలలో తితిదేలో వివిధ ఉద్యోగాలకై ప్రకటనలు ఇచ్చిన విషయం విదితమే.
అయితే తితిదేలో ఉద్యోగాలిప్పిస్తామని, ఏవిధంగానైనా, ఎవరైనా నిరుద్యోగులను మభ్యపెడితే అటువంటి వారి మాటలు నమ్మవద్దని, ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష ద్వారా వచ్చే మార్కుల ఆధారంగానే జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకతతో జరుగుతుంది.
జూనియర్ అసిస్టెంట్లు, ఎల్.డి. టైపిస్టులు, ఎల్.డి. స్టెనోగ్రాఫర్లు, యు.డి. స్టెనోగ్రాఫర్లు, అసిస్టెంట్/షరాబు ఉద్యోగాలకు గాను ఈరోజుకు (సోమవారం) 76,663 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరందిరికి వ్రాత పరీక్షలు నిర్వహించనున్నాం. వ్రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా కేటగిరి ప్రకారం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్దతిని పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
వ్రాత పరీక్షలు పూర్తి పారదర్శకతతో నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు మొదటి వారంలో వ్రాత పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తదితర వివరాల్ని తితిదే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.