1006th SRI RAMANUJACHARYA AVATAROSAVAM BEGINS _ భగవంతుడు అందరివాడన్న రామానుజాచార్యులు : టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి
Tirupati, 03 May 2022: Tirumala Pontiff Sri Sri Sri Chinna Jeeyarswami said all should follow the dictum of Sri Ramanujacharya which advocates that “God belongs to everyone”.
He was participating in the 1006th Sri Ramanujacharya Avatara Mahotsavam which commenced at the Annamacharya Kala Mandiram at Tirupati on Tuesday evening.
He said TTD was grandly celebrating the three-day long event of the great Sri Vaishnavaite in a befitting manner.
Thereafter Acharya Chakravarti Ranganathan of Tirupati gave a discourse on Sri Ramanuja Vaibhavam.
The sankeertans by artists of the Annamacharya project led by Smt Revathi troupe enthralled the devotees.
HDPP Officer Sri Vijay Saradhi, Alwar Divya Prabandam Project co-ordinator Sri Purushottam, Program Assistant Smt Kokila and local devotees were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
భగవంతుడు అందరివాడన్న రామానుజాచార్యులు : టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి
శ్రీ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2022 మే 03: భగవంతుడు అందరివాడని భగవద్ రామానుజాచార్యులు ఉద్బోధించారని, ప్రస్తుత సమాజంలో అందరూ దీన్ని పాటించాలని టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల 1006వ అవతార మహోత్సవాలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ ఆదిశేషుని అవతారమైన భగవద్ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని, శరణాగతి భక్తితో భగవంతుని కొలిస్తే దివ్యత్వం కలుగుతుందని అన్నారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. రామానుజార్యుల 1006వ అవతార మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ శ్రీ రామానుజ వైభవంపై ఉపన్యసించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రేవతి బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.