ANNUAL BRAHMOTSAVAMS BEGINS AT MANGALAMPETAANNUAL BRAHMOTSAVAMS BEGINS AT MANGALAMPETA _ మంగళంపేటలో ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 21 February 2026: The annual Brahmotsavams of the renowned Sri Prasanna Venkateswara Swamy Temple at Mangalampeta in Pulicherla mandal commenced ceremoniously on Saturday morning with Dhwajarohanam.

The Utsava deities of Sri Prasanna Venkateswara Swamy along with Sridevi and Bhudevi were taken in a procession around the temple, followed by the hoisting of the Garuda flag between 8 AM and 9 AM symbolically inviting all celestial deities to the festival. Special poojas were performed before the flag was hoisted on the Dwajasthambham. In the evening, the Sri Prasanna Venkateswara Swamy will bless devotees atop the Pedda Sesha Vahanam.

TTD has made elaborate arrangements for the Brahmotsavams being held from February 21 to March 2. Vahana Sevas will be conducted  from 8 AM to 9 AM and 6 PM to 8 PM

Key events include Garuda Seva on February 25 night, Rathotsavam on February 28 morning, Chakra Snanam on March 1 morning and Pushpayaga Mahotsavam on March 2 morning.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మంగళంపేటలో ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి,2026,ఫిబ్రవరి 21: పులిచర్ల మండలం మంగళంపేటలో ప్రసిద్ధిచెందిన  శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

ముందుగా శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు‌గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారుసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 08.00 నుండి 09.00 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారుఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారుకాగారాత్రి పెద్ద శేష వాహనంపై స్వామివారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

 ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టిందిబ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 08.00 గం. నుండి 09.00 గం.లకుసాయంత్రం 06.00 గం. నుండి 08.00 గం. వరకు వాహన సేవలు జరుగనున్నాయి.

శనివారం సాయంత్రం 06.00 గం.లకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై విహరించనున్నారు.

వాహన సేవల వివరాలు

ఫిబ్రవరి 22 తేదీ ఉదయం చిన్న శేష వాహనంసాయంత్రం హంస వాహనం, 23 తేదీ ఉదయం ముత్యపు పందిరి వాహనంసాయంత్రం సింహ వాహనం, 24 తేదీ ఉదయం కల్పవృక్ష వాహనంసాయంత్రం హనుమంత వాహనం, 25 తేదీ ఉదయం సర్వభూపాల వాహనంసాయంత్రం 06.00 గం.లకు కల్యాణోత్సవంరాత్రి 08.00 గం.లకు గరుడ సేవ, 26 తేదీ ఉదయం సూర్యప్రభ వాహనంసాయంత్రం చంద్ర ప్రభ వాహనం, 27 తేదీ ఉదయం మోహినీ ఉత్సవంసాయంత్రం గజ వాహనం, 28 తేదీ ఉదయం 08.00 గం.లకు రథోత్సవంసాయంత్రం అశ్వవాహనంమార్చి 01 తేదీన ఉదయం 11.00 గం.లకు చక్ర స్నానంరాత్రి 07.00 గం.లకు ధ్వజావరోహణంమార్చి 02 తేదీ ఉదయం 09.00 గం.లకు పుష్పయాగ మహోత్సవం చేపడుతారు.

 కార్యక్రమంలో ఆలయ అర్చకులుసూపరింటెండెంట్ శ్రీ వైనాగేంద్ర ప్రసాద్టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ రాహుల్ యాదవ్జూనియర్ అసిస్టెంట్ శ్రీ శ్రీ హర్షభానుప్రకాశ్సిబ్బందిగ్రామ పెద్దలుభక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది