MAHA SAMPROKSHANAM AT MANGALAMPETA TEMPLE _ మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
ANNUAL BRAHMOTSAVAMS FROM FEBRUARY 20 TO MARCH 02
Tirupati, 20 February 2026: The Maha Samprokshanam was performed as per Agama traditions at Sri Prasanna Venkateswara Swamy Temple in Pulicherla Mandal of Chittoor district.
The rituals, which commenced on February 17, concluded on Friday with Teertha Goshti, Vigraha Pratishtha, Pranadidasa Homams, Maha Poornahuti and Mahakumbha Samprokshanam.
Agama Advisor Sri Srinivasacharyulu, Deputy EO Smt. V.R. Shanthi, AEO Sri A.B. Narayana Chowdary, EE Sri Mallikarjuna Prasad, temple staff and a large number of devotees participated.
The annual brahmotsavams also commenced on February 20 which will conclude on March 02.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
ఫిబ్రవరి 20 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2026, ఫిబ్రవరి 20: చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళం పేటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 17 నుండి నుండి ప్రారంభమైన మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిసాయి. ఈ సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.
శుక్రవారం ఉదయం తీర్థగోష్టి, గోపుర బలిపీఠ ప్రతిజ్ఞ, విగ్రహ ప్రతిష్ట, ప్రాణాదిదశ హోమములు, మహాపూర్ణాహుతి, కుంభోద్వావాసన, మండపోదవాసన, మదలోద్వాసన మొదలైన కార్యక్రమాల అనంతరం మహాకుంభ సంప్రోక్షణ, విద్వాత్సంభవన, తీర్థప్రసాద గోష్టి తదితర కార్యక్రమాలను చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసచార్యులు, డిప్యూటీ ఈవో శ్రీమతి వి. ఆర్.శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీ నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఇస్పెక్టర్ శ్రీ పి. రాహుల్, ఆలయ అర్చకులు, సిబ్బంది, విరివిగా భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 20 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
పులిచర్ల మండలం మంగళం పేటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి మార్చి 02 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 06.00 గం.లకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 08.00 గం.ల నుండి 09.00 గం.లకు, సాయంత్రం 06.00 గం.ల నుండి 08.00 గం.ల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
21వ తేదీ శనివారం ఉదయం 08.00 గం.లకు ధ్వజారోహణం చేపడుతారు. అదేరోజు సాయంత్రం 06.00 గం.లకు స్వామి వారు పెద్ద శేష వాహనంపై విహరించనున్నారు.
వాహన సేవల వివరాలు
ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంస వాహనం, 23వ తేదీ ఉదయం ముత్యపు పందిరి వాహనం, సాయంత్రం సింహ వాహనం, 24వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం హనుమంత వాహనం, 25వ తేదీ ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం 06.00 గం.లకు కల్యాణోత్సవం, రాత్రి 08.00 గం.లకు గరుడ సేవ, 26వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్ర ప్రభ వాహనం, 27వ తేదీ ఉదయం మోహినీ ఉత్సవం, సాయంత్రం గజ వాహనం, 28వ తేదీ ఉదయం 08.00 గం.లకు రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం, మార్చి 01వ తేదీన ఉదయం 11.00 గం.లకు చక్ర స్నానం, రాత్రి 07.00 గం.లకు ధ్వజావరోహణం, మార్చి 02వ తేదీ ఉదయం 09.00 గం.లకు పుష్పయాగ మహోత్సవం చేపడుతారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా, తాగునీరు, అన్నప్రసాదాలు, చలువ పందిళ్లు, విద్యుత్, పుష్ప అలంకరణలు, ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




