TTD ADDITIONAL EO SRI AV DHARMA REDDY VISITS MANTRALAYA _ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 20 Mar. 21: TTD Additional EO Sri AV Dharma Reddy on Saturday visited Sri Raghavendra Swamy Mutt at Mantralayam in Kurnool district.

As part of the tradition in vogue since 2006, he presented Pattu vastram to the temple on the occasion of the 399th Coronation Ceremony of Sri Guru Raghavendra Swami on behalf of the Srivari temple.

Earlier the Additional TTD EO called on the pontiff of Mantralayam Sri Subudendra Thirtha Swamy and presented Pattu Vastrams and received blessings from the pontiff.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల, 2021 మార్చి 20: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 426వ వర్ధంతి ఉత్సవం సందర్భంగా టిటిడి తరఫున అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి శనివారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.

హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్‌ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో 1595వ సంవత్సరంలో తమిళనాడులోని కావేరిపట్నంలో శ్రీ తిమ్మన్న భట్ట, శ్రీమతి గోపికాంబ దంపతులకు శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.

ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు అద‌న‌పు ఈవోను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఏఈఓ శ్రీ లక్ష్మయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.