SRI SOMASKANDA MURTHY WITH KAMAKSHI AMMAVARU ON MAKARA VAHANAM _ మకర వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి సమేత కామాక్షి అమ్మవారు
Tirupati, 11 February 2026: As part of the Brahmotsavams of Sri Kapileswara Swamy Temple in Tirupati, on the fourth day, Sri Kapileswara Swamy as Sri Somaskanda Murthy along with Kamakshi ammavaru blessed devotees on the Makara Vahanam.
The Vahana Seva was held grandly through the temple streets amidst bhajans, Kolatams and traditional musical instruments.
Later, between 9 am and 10 am, Snapana Tirumanjanam was performed to Sri Somaskanda Murthy and Kamakshi ammavaru with milk, curd, honey, fruit juices and sandalwood paste.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మకర వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి సమేత కామాక్షి అమ్మవారు
తిరుపతి, 2026 ఫిబ్రవరి 11: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.
అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్ , టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ దామోదర్. శ్రీ రవికుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.








