SOMASKANDA RIDES MAKARA _ మకర వాహనంపై కపిలతీర్థ విభుడు
Tirupati, 25 Feb. 22: Sri Somaskanda Murty accompanied by Sri Kamakshi Devi, seated on Makara Vahanam and blessed devotees at Sri Kapileswara Swamy temple.
On the fourth day of ongoing Brahmotsavams in Ekantam, Makara Vahanam took place.
Temple DyEO Sri Subramanya, Superintendent Sri Bhupati and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మకర వాహనంపై కపిలతీర్థ విభుడు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 25: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.
అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు శేష(నాగ) వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.
వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ సత్రేనాయక్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.