PROGRESSIVE HUMANITARIAN GESTURE BY A TTD WOMEN EMPLOYEE _ మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్, శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకారం

DONATES HER BODY TO SVIMS MEDICAL COLLEGE AFTER HER DEATH
 
Tirupati, 23 January 2026:In one of its kind progressive humanitarian gesture, a TTD Women Employee, has pledged to donate her body to SVIMS after her demise and her rare decisions has won laurels all over.

Smt. Kattamanchi Indira, the President of the TTD Women’s Welfare Association and currently discharging her duties as the Superintendent of the Audit Department, has agreed to donate her body to SVIMS – Sri Padmavathi Medical College after her death. 

To this effect, she handed over an affidavit to the TTD Executive Officer Sri Anil Kumar Singhal in his chamber at the TTD Administrative Building in Tirupati on Friday.
 
Speaking on the occasion, Smt. K. Indira said that her husband, Dr. K. Shivaji, who had worked as a faculty member in several corporate colleges, had donated his body to a medical college after his death with the noble intention of being useful to students even after his demise.
 
Following her husband’s wish, she handed over the relevant affidavit to the TTD EO on Friday, expressing her intention that her body should also be useful to medical students after her death.
 
Appreciating her decision, TTD EO Sri Anil Kumar Singhal stated that it is in fact a commendable gesture.
 
”Making your body useful to medical students rather than letting it decompose in the soil after death is really a unique and commendable gesture,” he maintained.
 
The Affidavit is forwarded to the officials of the Anatomy Department at Sri Padmavathi Medical College.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకారం

తిరుపతి, 2026, జనవరి 23: టిటిడి మహిళా సంక్షేమ విభాగానికి చెందిన అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ శ్రీమతి కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్థివ దేహం  స్విమ్స్ – శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ను శుక్రవారం కలిసి అఫిడవిట్ ను అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి కె. ఇందిర మాట్లాడుతూ, గత నవంబర్ 15వ తేదీన తన భర్త డా. కె. శివాజీ పలు కార్పోరేట్ కాలేజీలలో ఫ్యాకల్టీగా పనిచేశారని, తాను చనిపోయినా విద్యార్థులకు ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో మరణానంతరం తన భర్త పార్థివ దేహం మెడికల్ కాలేజీకి డొనేషన్ చేశామన్నారు. తన భర్త కోరిక మేరకు తాను చనిపోయాక తన పార్థివ దేహం మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం అందుకు సంబంధించిన అఫిడవిట్ ను టిటిడి ఈవోకు అందజేశారు. శ్రీమతి కె. ఇందిర నిర్ణయాన్ని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు.

మరణానంతరం పార్థీవ దేహం మట్టిలో కలిసిపోవడం కన్నా మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడేలా శ్రీమతి కె. ఇందిర నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అని తెలిపారు. అందుకు సంబంధించిన అఫిడవిట్ ను శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల అనాటమి డిపార్ట్ మెంట్ అధికారులకు టిటిడీ ఈవో పంపించారు.

మహిళా  సంక్షేమ సంఘం .

నవంబరు 15 వ తేదీ .

గతంలో తిరుపతిలోని లీలా మహల్ వద్ద భార్యాభర్తలిద్దరూ కార్పొరేట్ స్కూలు స్థాపించడం జరిగింది. 

ఎంతోమంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పించడంతోపాటు కొంతమందికి ఉపాధి చూపించవచ్చు అనే ఉద్దేశ్యంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూలును స్థాపించారు. 

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.