SSSSO TEAM MEETS TTD EO _ మరింత సేవా భావంతో శ్రీవారి సేవకుల సేవలు
TIRUMALA, 04 FEBRUARY 2025: A team from Sri Satya Sai Seva Organization led by its AP President Sri Lakshman Rao formally met the TTD Executive Officer Sri J Syamala Rao in the latter’s chamber in the TTD administrative building in Tirupati on Tuesday.
The team which is on an invitation from TTD for providing a Training Module for improving Srivari Seva upon the instructions of the Honourable CM of AP Sri N Chandrababu Naidu has submitted a Document after observing the services of Srivari Sevaks in each User Department in Tirumala for five days.
The team explained the EO the core observations they have made including the Registration process in Seva Sadan, Sevaks training program, Sevaks Duties, Group leaders, enhancing the quality of Service etc.
They said they have visited and thoroughly interacted with the staff and sevaks in Annaprasadam, Laddu Counters, VQC 1&2, CRO, Chappals Counters, Common Luggage, Supadham, Employees Canteen, Cashew Split seva and
submitted a detailed document.
After studying the document, the TTD EO appreciated the ideas shared by the SSSSO team, especially the Training the Trainees program suggested by them. He also said, the training of sevaks using tge services of SSSSO which existed a few years ago will be revived to enhance the quality of Srivari Sevaks in the larger interests of multitude of visiting pilgrims.
TTD Chief PRO Dr T Ravi, SSSSO team members including AP Vice President Sri Surendra, State Co-ordinator of Seva Sri Syamprasad, State Joint co-ordinator Sri Vishwanatha Reddy were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మరింత సేవా భావంతో శ్రీవారి సేవకుల సేవలు
భక్తులకు అందించేందుకు వీలుగా
సమగ్ర నివేదిక రూపొందించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు
టిటిడి ఈవోకు నివేదికను అందించిన బృందం
తిరుమల, 2025, మార్చి 04.: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత బాధ్యతగా సేవా భావంతో సేవలు అందించేందుకు శ్రీసత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు సభ్యుల బృందం సమగ్రనివేదికను రూపొందించింది. ఈ బృందం మంగళవారం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో శ్రీ జె. శ్యామల రావుకు నివేదికను అందించారు.
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దేశంలో పేరొందిన ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణా పరమైన సూచనలను, సలహాలను తీసుకుని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో భాగంగా ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు బృందం (1. శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్షులు, 2. శ్రీ చుండూరి సురేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు, 3. శ్రీ కొమరగిరి శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర సేవా సమన్వయకర్త, 4. శ్రీ చెవిటి విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర జాయింట్ సేవా సమన్వయకర్త) ఫిబ్రవరి 28 నుండి 5 రోజుల పాటు తిరుమలలో క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పరిశీలించి నివేదికను తయారు చేసి టిటిడి ఈవోకు అందించారు.
నివేదికలో సేవకులకు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్, సులభతరంగా రిజిస్ట్రేషన్ , క్షేత్ర స్థాయిలో శిక్షణ , గ్రామ స్థాయిలో ధర్మ ప్రచారానికి సేవకులతో సమన్వయం
వీటితో పాటు శాఖల వారీగా చేపట్టాల్సిన అంశాలను, సౌకర్యాలను నివేదిక రూపంలో ఈవోకు అందించారు. సదరు 7 పేజీల నివేదిక ఇచ్చిన ప్రతినిధులను ఈ సందర్భంగా ఈవో అభినందించారు. శ్రీవారి సేవకుల సేవలపై శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు ఇచ్చిన నివేదిక మరింత ఉపయోగకరంగా ఉందని, సదరు నివేదికలోని అంశాలను అమలు చేసి శ్రీవారి భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని ఈవో చెప్పారు. ఈ సందర్భంగా నివేదికపై తదుపరి చర్యలు తీసుకోవాలని సిపీఆర్వో డా.టి.రవిని ఆదేశించారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.