SANGEETHA MAHOTSAVAMS BEGINS AT MAHATI _ మహతిలో శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం

Tirupati, 28 Feb. 22: The three-day Sivaratri Sangeeta Mahotsavams commenced in Mahati Auditorium at Tirupati on Monday evening.

SV College of Music and Dance former Principal Smt YVS Padmavathi and her team presented Sankeertans in a melodious manner.

Similarly, Violin, Mridangam, Flute, Veena, Mridangam, Nada Swaram were also performed on the occasion.

The Principal of SV College of Music and Dance Sri Sudhakar, faculty and students were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మహతిలో శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 28: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మ‌రియు ఎస్వీ నాద‌స్వ‌ర‌, డోలు పాఠ‌శాల ఆధ్వర్యంలో సోమ‌వారం తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు వేడుక‌గా ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌రకు, తిరిగి మ‌ధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఈ సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

ముందుగా క‌ళాశాల‌, పాఠ‌శాల విద్యార్థుల ప్రార్థ‌న‌తో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, శ్రీ న‌ట‌రాజ‌స్వామివారికి పూజ‌లు చేశారు. మొద‌ట‌గా ఎస్వీ నాద‌స్వ‌రం డోలు పాఠ‌శాల విద్యార్థులు మంగ‌ళ‌క‌రంగా నాద‌స్వ‌రం, డోలు వాయిద్య‌సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆ త‌రువాత మోహ‌న‌కృష్ణ‌, ప‌వ‌న్‌కుమార్‌, రూపేష్ అనే విద్యార్థులు ప‌లు భ‌క్తిగీతాల‌ను బృంద‌గానం చేశారు. అనంత‌రం క‌ళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డా. వైవిఎస్‌.ప‌ద్మావ‌తి, వారి శిష్యులు ల‌క్ష్మి, కె.పి.రాధిక బృందం వీనుల‌విందుగా భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

ఆ త‌రువాత వ‌యోలిన్ – మృదంగం వాద్య సంగీతం, గాత్ర సంగీతం, వేణువు – వీణ వాద్య సంగీతం, మృదంగ ల‌య విన్యాసం, నాద‌స్వ‌రం – డోలు వాద్య సంగీతం నిర్వ‌హించారు. అదేవిధంగా, అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి పూర్ణా వైద్య‌నాథ‌న్ – వ‌యోలిన్‌, శ్రీ ఎల్‌.జ‌య‌రాం – వ‌యోలిన్‌, శ్రీ‌మ‌తి జి.జ్ఞాన‌ప్ర‌సూన‌-వీణ‌, శ్రీ ఎ.చెన్న‌య్య – వేణువు, శ్రీ బి.ర‌ఘురాం – మృదంగం వాద్య స‌మ్మేళ‌నం ఆక‌ట్టుంది.

వీటితోపాటు అధ్యాప‌కులు శ్రీ ఎ.శ‌బ‌రి గిరీష్ గాత్ర సంగీతం, శ్రీ సి.హ‌ర‌నాథ్ శిష్య బృందం – భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌, శ్రీ ఎస్‌.మునిర‌త్నం – నాద‌స్వ‌ర వాద్యం, శ్రీ రావిపాటి స‌త్య‌నారాయ‌ణ‌, ఎం.నాగేశ్వ‌ర‌రావు, శ్రీ జి.చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీ సంప‌త్‌, శ్రీ సంకీర్త్‌, శ్రీ న‌రేంద్ర‌, శ్రీ లోకేష్ ల‌య‌విన్యాసం కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్, అన్ని విభాగాల అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.