TTD CHAIRMAN LAUDS THE SERVICES OF DEPUTED EMPLOYEES OF KUMBH MELA _ మహా కుంభమేళలో సేవలందిస్తున్న టిటిడి ఉద్యోగులకు ధన్యవాదాలు: టిటిడి ఛైర్మన్

Tirumala, 31 January 2025: TTD Chairman Sri.  BR Naidu on behalf of the entire Trust board complimented the services of deputed employees of TTD at Kumbhmela.

TTD has constructed a Srivari temple in  Maha Kumbh Mela at Prayaga Raj of Uttar Pradesh in Sector 06.

Speaking to the media after the TTD board meeting on Friday at Annamaiah Bhavan in Tirumala he said that more than 250 TTD employees are providing services in the Maha Kumbh Mela. 

On an average, more than ten thousand devotees visit Sri Venkateswara Swamy  temple every day at Prayagraj.

He said that Srivari Kainkaryams and prasadams were being distributed in the style of Tirumala and praises are being received from the devotees in Prayaga Raj. 

He complimented the services of religious and non-religious deputed staff for their impeccable services.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మహా కుంభమేళలో సేవలందిస్తున్న టిటిడి ఉద్యోగులకు ధన్యవాదాలు: టిటిడి ఛైర్మన్

తిరుమల, 2025 జనవరి 31: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ వద్ద జనవరి 23 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళలో టిటిడి తరుపున శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులకు విశేష సేవలు అందిస్తున్న టిటిడి అర్చకులు, అధికారులు, సిబ్బందికి టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పాలకమండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

టిటిడి బోర్డు మీటింగ్ అనంతరం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మహా కుంభమేళలో దాదాపు 250 మందికి పైగా టిటిడి ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని తెలిపారు.

రోజుకు సరాసరి పది వేలకు పైగా శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కైంకర్యాలను, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారని, ప్రయాగ రాజ్ లో భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయని తెలిపారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది