మాడ వీధుల్లోని గ్యాలరీలలో టిటిడి ఈవో పరిశీలన

మాడ వీధుల్లోని గ్యాలరీలలో టిటిడి ఈవో పరిశీలన

తిరుమల, 2025, ఫిబ్రవరి 04: రథసప్తమి సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలలో భక్తుల సౌకర్యాలను మంగళవారం ఉదయం టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా భక్తులకు ఉదయం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి క్రమంగా అన్నప్రసాదాలు అందుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాలరీలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
వాహన సేవల విరామ సమయాల్లో గ్యాలరీలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

గ్యాలరీలలో ఉన్న వివిధ ప్రాంతాల భక్తులతో మాట్లాడారు. భక్తులు ప్రశాంతంగా వాహన సేవలను వీక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సిఈ శ్రీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.