VENKATADRI- A CITADEL OF MOTHERHOOD- SWAMINI RAMYANANDA BHARATI _ మాతృ శక్తికి కేంద్రం వెంకటాద్రి పర్వతం : శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని
Text content
మాతృ శక్తికి కేంద్రం వెంకటాద్రి పర్వతం : శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని
తిరుపతి, 2022 మార్చి 31: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతాలు మాతృశక్తికి కేంద్రమని రాయల్ చెరువు శక్తి పీఠాధీశ్వరి పుణ్య శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని తెలిపారు. తాళ్లపాక అన్నమాచార్యుల 519వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం ఉదయం అన్నమాచార్య కళామందిరంలో శ్రీ అంజనాద్రి హనుమద్ వైభవం సాహితీ రూపకం ప్రదర్శన అద్భుతంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని అనుగ్రహ భాషణం చేస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువై ఉండడానికి కారణం వకుళామాత అని, ఆంజనేయస్వామివారు జన్మించడానికి ఆంజనాదేవి కారణం అన్నారు. అంజనాద్రిలో హనుమంతుని జన్మవృత్తాంతం, ఆయన వైభవాన్నియుగయుగాలనాటి చరిత్రను నేటి కాలనికి అన్వయిస్తూ సత్‌ప్రమాణాలతో సంగీత సాహిత్యాలతో కూడిన నృత్యరూపకం ప్రదర్శించారన్నారు. శ్రీవైష్ణవులకు, శైవులకు ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామివారని పురాణాలతో జోడించి వివరించారు.
అనంతరం శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని సమక్షంలో అదితిగా గుంటూరుకు చెందిన డా.నాగరాజ్యలక్ష్మీ, అరుంధతిగా తణుకుకు చెందన డా.వీరలక్ష్మీ, అనసూయగా రాజమండ్రికి చెందిన డా.అన్నపూర్ణ, లోపాముద్రగా తిరుపతికి చెందిన డా.జయంతి సావిత్రి, రేణుకగా నూజివీడుకు చెందిన శ్రీమతి కనకదుర్గ, గార్గిగా తిరుపతికి చెందిన శ్రీమతి వందన నటించారు.
ఇందులో హనుమంతుని జన్మస్థలం, బాల్యం, రామాయణ, భారతాలు, పురాణాలలో ఉన్న సాక్షాధారాలను ఋషిపత్నులు అద్భుతంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ విజయసారధి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.
కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు టిటిడి ఆస్థాన గాయకులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ బృందం గాత్ర సంగీతం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ చంద్రశేఖర్ బృందం మహాకవి కాళిదాసు హరికథ పారాయణం నిర్వహిస్తారు.
మహతి కళాక్షేత్రంలో…
మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ హరిబాబు బృందం మంగళధ్వని, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత కళాకారులు శ్రీ నాగేశ్వరనాయుడు బృందం గాత్రం, రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీ హరినాథ్ బృందం భరతనాట్యం జరుగనుంది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
Tirupati, 31 March 2022: Pontiff of Rayalcheruvu Peetham Mata Ramyananda Bharati Swamini said that the Venkatadri hill ranges is the centre for women empowerment and citadel of motherhood.
Participating in the 519th Annamacharya Vardhanti fete at Annamacharya Kala Mandiram, in her blessing speech, the Mataji said while Vakulamata was the cause of Sri Venkateswara to reside in Sheshachala hills and similarly Anjana Devi was responsible for Anjaneya birth in the sacred hill ranges.
The highlight of the vardhanti celebrations was the stage play of Sri Anjanadri Hanumad Vibhavam and that Anjaneya was worshipped equally by Vaishnavites and Saivites.
The other hallmark of the celebrations was the portrayal of women vidushis from the Vedic period including Aditi by Dr Nagarajyalakshmi of Guntur, Arundhati by Dr Viralakshmi of Tanuku, Anasuya by Dr Annapurna, Lopamudra role by Dr Jayanti Savitri of Tirupati, Renuka by Smt Kanaka Durga of Nuzividu and finally Gargi role by Smt Vandana of Tirupati.
As the spouses of Rushis narrated the biography of hanuman as depicted in epics, puranas and other material sources.
All Hindu Projects Program Officer Sri Vijay Saradhi, Annamacharya Project Director Dr A Vibhishana Sharma and others were present.
The other programs of evening included vocal by TTD Asthana singer Sri Balakrishna Prasad and Mahakavi Kalidasa Harikatha parayanam by Sri Chandrasekhar troupe of Tirupati.
AT MAHATI AUDITORIUM
At Mahati Kala Kshetram the team of Sri Haribabu of Tirupati presented Mangala Dwani, vocal by Sri Nageswara Rao Naidu and Bharata Natyam by Sri Harinath team of SV College of Music and dance.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI