MARCH MONTH FESTIVITIES IN TIRUCHANOOR TEMPLES _ మార్చి నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, ఉప ఆలయాలలో విశేష ఉత్సవాలు
Tirupati, 26 February 2025: In the month of March, there are special festivals in the main and the sub-temples of Sri Padmavati Devi at Tiruchanoor.
Trichy Utsav will be conducted on March 7, 14, 21 and 28 at 6 pm.
– On the occasion of Uttarashada Nakshatra on March 24 Sri Padmavathi will ride the Gaja Vahanam at 6:45pm
– On the occasion of Ugadi on March 30, at 6 pm, the goddess will be paraded on a floral palanquin in the streets of the temple complex.
– On March 2, Sri Sundararaja Swami will parade on Tiruchi at 6 pm.
– Trichy Utsavam will be held on 6th March for Sri Krishna Swami at 6 pm.
– Trichy Utsavam will be conducted for Sri Suryanarayana Swami on March 16 at 5 pm.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, ఉప ఆలయాలలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 26: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• మార్చి 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
• మార్చి 24న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
– మార్చి 30న ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పుష్ప పల్లకీపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో…
– మార్చి 2న శ్రీ సుందరరాజ స్వామివారు సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో..
– మార్చి 6న శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..
– మార్చి 16న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.