SPECIAL CELEBRATIONS AT SRI GOVINDARAJA SWAMY TEMPLE IN THE MONTH OF MARCH _ మార్చి నెల‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 27 February 2025: Many special festivals will be held in the month of March in Sri Govindaraja Swamy temple in Tirupati. Their details are as follows:

 – On March 6, in the advent of Rohini Nakshatra, at 5.30pm, Sri Parthasaradhi Swamy along with Rukmini and Satyabhama will parade along the Mada streets

 – On 7th, 21st and 28th of March on Friday at 6 pm Sri Andal Ammavaru will parade in the Mada streets of the temple.

 – On the occasion of the Pournami on March 14, Swami rides on the Garuda Vahanam.

 – On March 25, in the advent of Shravana Nakshatra, at 6 pm Sridevi and Bhudevi along with Sri Kalyana Venkateswara Swamy will parade along the four Mada streets of the temple and bless the devotees.

 – Koil Alwar Tirumanjanam on the occasion of Ugadi at Sri Govindaraja Swamy temple on 27th March.

 – Ugadi Asthanam at the temple on March 30.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి నెల‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 27: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 6న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిస్తారు.

– మార్చి 7, 21, 28వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

– మార్చి 14న పౌర్ణమి సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తారు.

– మార్చి 25న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్ర‌హించ‌నున్నారు.

– మార్చి 27న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉగాది సంద‌ర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

– మార్చి 30న ఆల‌యంలో ఉగాది ఆస్థానం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.