ANKURARPANAM FOR SKVST BTUs ON MARCH 1 _ మార్చి 1న శ్రీనివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

SrinivasaMangapuram , 27 Feb 2021: TTD is organising the Ankurarpanam ritual on March 1 for the annual Brahmotsavams of Sri Kalyana Venkateswara temple at Srinivasa Mangapuram in Ekantham in view of Covid guidelines.

The rituals of Punyahavachanam, Mrutsangrahanam, Senadhipathi utsava will be performed in the evening of Monday as part of Ankurarpanam.

Following are the details of the Vahana sevas during the Brahmotsavam :

02-03-2021(Tuesday)- Dwajarohanam ( Meena Lagnam) and Pedda Sesha Vahana 

03-03-2021(Wednesday)-  Chinna Sesha vahanam and Hamsa Vahanam

04-03-2021(Thursday ) –   Simha vahanam and Muthyapu pandiri vahanam

05-03-2021(Friday )  –     Kalpavruksha vahanam and Sarva Bhoopala vahanam

06-03-2021(Saturday )-    Pallaki vahanam ( Mohini avataram ) and Garuda vahanam

07-03-2021( Sunday )  –     Hanumantha vahana and Tiruchi, Gaja vahana 

08-03-2021( Monday ) –      Surya Prabha vahana and Chandra Prabha vahana 

09-03-2021 ( Tuesday )  –   Sarva Bhoopala vahana  and Aswa vahana 

10-03-2021(Wednesday ) –    Chakra snanam and Dwajarohanam 

In view of the Covid guidelines all Vahana sevas are held in ekantham morning 08-09.00, and evening 7.00-8.00 pm hours , the Garuda seva will be held at night 7.30-8.30 pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 1న శ్రీనివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2021 ఫిబ్రవరి 27: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు మార్చి 1న అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలో  ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా సోమ‌వారం  సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                                  ఉదయం                                  రాత్రి

02-03-2021(మంగ‌ళ‌వారం)          ధ్వజారోహణం(మీన‌లగ్నం)  పెద్దశేష వాహనం

03-03-2021(బుధ‌వారం)            చిన్నశేష వాహనం                     హంస వాహనం

04-03-2021(గురువారం)            సింహ వాహనం                   ముత్యపుపందిరి వాహనం

05-03-2021(శుక్ర‌వారం)         కల్పవృక్ష వాహనం                 సర్వభూపాల వాహనం

06-03-2021(శ‌ని‌వారం)      పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం)   గరుడ వాహనం

07-03-2021(ఆదివారం)        హనుమంత వాహనం            తిరుచ్చి, గజ వాహనం

08-03-2021(సోమ‌వారం)          సూర్యప్రభ వాహనం             చంద్రప్రభ వాహనం

09-03-2021(మంగ‌ళ‌ వారం)         సర్వభూపాల వాహనం       అశ్వవాహనం

10-03-2021(బుధ‌‌వారం)            చక్రస్నానం                        ధ్వజావరోహణం

 ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు  స్వామి, అమ్మ‌వార్లకు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.