మార్చి 1 నుండి ”శుభప్రదం” దరఖాస్తుల స్వీకరణ
మార్చి 1 నుండి ”శుభప్రదం” దరఖాస్తుల స్వీకరణ
తిరుపతి, ఫిబ్రవరి 28, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ”శుభప్రదం” పేరిట మే నెలలో నిర్వహించనున్న వేసవి శిక్షణ తరగతులకు మార్చి 1వ తేదీ నుండి దరఖాస్తులను స్వీకరించనున్నారు. పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని జిల్లా కేంద్రాల్లోని తితిదే కల్యాణమండపాల్లో ఉచితంగా దరఖాస్తులు లభిస్తాయి. పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 31వ తేదీలోపు ఆయా జిల్లా కేంద్రాల్లోని తితిదే కల్యాణ మండపాల్లో అందజేయాల్సి ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.