PEETHAPURAM ANNUAL FESTIVAL FROM MARCH 10-14 _ మార్చి 10 నుండి 14వ తేదీ వరకు పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
మార్చి 10 నుండి 14వ తేదీ వరకు పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025 మార్చి 02: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 10 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 9న సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
మార్చి 10న ఉదయం 10.10 నుండి 10.30 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మార్చి 11న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారి గరుడ వాహన సేవ జరుగనుంది.
మార్చి 11, 12, 13వ తేదీలలో ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుగనుంది. మార్చి 12, 13వ తేదీల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. మార్చి 14న ఉదయం 10.10 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. మార్చి 15న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.