MAHA SIVARATHRI IN KT _ మార్చి 11న శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి
Tirupati, 10 Mar. 21: As part of the ongoing animal from hot songs in Sri Kapileswara Swamy Temple, Maha Sivarathri will be observed on March 11.
Devotees will be allowed for the Darshan from 5:30 a.m. till 2 p.m. again from 4:30 p.m. till 12 midnight. Bhogi Tereu will be observed between 7 a.m. and 8 a.m. followed by Tirumanjanam between 9 a.m. and 10 a.m.in Ekantham.
The most important Nandi Vahana Seva will be observed in the evening between 6 p.m. and 8 p.m.
Lingodbhava Kaala Abhishekam will be observed in midnight of March 11 till 4 am.
Elaborate security arrangements have been made by TTD in view of the anticipated devout influx.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి 11న శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి
తిరుపతి, 2021 మార్చి 10: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 11వ తేదీ గురువారం మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరుగనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా గురువారం ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఏకాంతంగా భోగితేరు ఆస్థానం, ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఏకాంతంగా నంది వాహనం ఆస్థానం నిర్వహిస్తారు. మార్చి 12వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.