46th DEATH ANNIVERSARY OF SRI RALLAPALLI ANANTHAKRISHNA SHARMA _ మార్చి 11న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 46వ వర్ధంతి
మార్చి 11న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 46వ వర్ధంతి
తిరుపతి, 2024 మార్చి 10: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 46వ వర్ధంతి కార్యక్రమం మార్చి 11న మంగళవారం జరుగనుంది.
టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రాగణంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గంటలకు సాహితీ సదస్సుతో కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమంలో శ్రీ అనంతకృష్ణశర్మ మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. రాళ్లపల్లి సాహిత్యంపై తిరుపతికి చెందిన శతావధాని శ్రీ ఆముదాల మురళి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా.లక్ష్మీనారాయణ ప్రసంగిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.