PANGUNOTTARA UTSAVAM IN GT _ మార్చి 12 నుండి 17వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుణోత్తర ఉత్సవం

Tirupati, 11 Mar. 22: Pangunittara Utsavam in the sub temple of Pundarikavalli Tayar in Sri Govindaraja Swamy temple will be observed in Ekantam from March 12-17.

In connection with this festival, Tirumanjanam will be performed to the presiding deity of Tayar on March 14.

On March 18, Garuda Seva will be performed in Ekantam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 12 నుండి 17వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుణోత్తర ఉత్సవం

తిరుపతి, 2022 మార్చి 11: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గల శ్రీ పుండరీకవళ్లి (సాలైనాంచియార్‌) అమ్మవారి పంగుణోత్తర ఉత్సవం మార్చి 12 నుండి 17వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా మార్చి 14వ తేదీన అమ్మ‌వారికి తిరుమంజనం నిర్వహిస్తారు. ప్ర‌తిరోజూ సాయంత్రం విశేష‌స‌మ‌ర్ప‌ణ అనంత‌రం శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారిని ఆలయ విమానప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హించి ఊంజల్‌సేవ నిర్వ‌హిస్తారు. మార్చి 18వ తేదీన పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ ఏకాంతంగా జ‌రుగ‌నుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.