SRINIVASA KALYANAM AT SV TEMPLE IN AMARAVATHI ON MARCH 15 – TTD EO _ మార్చి 15న అమరావతి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం – ⁠ ⁠టీటీడీ ఈవో  శ్రీ జె.శ్యామలరావు

Tirumala, 07 March 2025: TTD EO Sri. J. Syamala Rao said that the celestial Srinivasa Kalyanam will be conducted on March 15 at the Srivari Temple in Amaravati.  

On the occasion of Srinivasa Kalyanam, he held a coordination meeting with TTD officials in Amaravati.

Speaking on the occasion, EO said that in 2018, AP CM Sri Nara Chandrababu Naidu, allocated 25 acres of land towards the construction of Srivari Temple in Amaravati and laid the foundation stone in 2019 and the temple was opened in 2022.

With an aim to spread Srivari glory, TTD has taken up large-scale arrangements as the devotees of Amaravati have requested to organize the Srivari Kalyanam.

On March 15, the honourable Chief Minister of AP Sri N Chandrababu Naidu will attend the divine wedding ceremony.

Around 25,000 people are expected to attend this event.  Arrangements are being made including drinking water, buttermilk and Annaprasadam will be distributed to all the devotees.  

LED screens are also being set up while Srivari Dharma Rathams will give wide publicity.  

He said that devotional music, spiritual and cultural programs will be organized under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and the program will be telecast live on SVBC channel for the sake of global devotees.

In this program CRDA Commissioner Mr. Kannababu, Endowments Secretary Sri. Vinay Chand, District Collector  Smt.  Nagalakshmi, Commissioner in-charge AP Endowments Sri Ramachandra Mohan, TTD JEO Sri Veerabrahmam, Joint Collector Sri. Bhargvatheja, SP Sri. Satish Kumar, CE Sri Satyanarayana and other officials were present.

Later, TTD EO inspected the ongoing arrangements in the temple premises for Srinivasa Kalyanam and gave several suggestions to the officials.  

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 15న అమరావతి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం – ⁠ ⁠టీటీడీ ఈవో  శ్రీ జె.శ్యామలరావు

తిరుమల, 2025 మార్చి 07: అమరావతిలోని శ్రీవారి ఆలయంలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ఆయన అమరావతిలో టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, 2018లో అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి హోదాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు 25 ఎకరాల స్థలం కేటాయించి 2019లో శంకుస్థాపన చేశారని తెలిపారు. 2022లో ఈ ఆలయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.

శ్రీవారి వైభవాన్ని నాలుగు దిశల వ్యాప్తి చేసేందుకు టీటీడీ శ్రీవారి కళ్యాణం ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ క్రమంలో అమరావతిలోని భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని కోరడంతో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టిందన్నారు.

మార్చి 15న టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి దాదాపు 25వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి కల్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులందరికీ తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పంపిణీ చేనున్నట్లు తెలిపారు. భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్కీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ కార్యక్రమంపై ఇప్పటికే శ్రీవారి ధర్మ రథాలతో ప్రచారం చేస్తున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్ లో ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీ కన్నబాబు, దేవాదాయశాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్. నాగలక్ష్మి, దేవాదాయ శాఖ ఇంఛార్జి కమిషనర్ రామచంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీ భార్గవతేజ, ఎస్పీ శ్రీ సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కళ్యాణం ఏర్పాట్లపై ఈవో తనిఖీలు :

అనంతరం టిటిడి ఈవో శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

టిటిడి ఈవో వెంట సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబు, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్, టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ ఇంఛార్జి కమిషనర్ రామచంద్ర మోహన్, టిటిడి సీఈ శ్రీ సత్యనారాయణ ఇతర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.