Tirumala, 12 March 2026: TTD is set to organize the 523rd Death Anniversary of the great Saint Poet Sri Thallapaka Annamacharya in Tirumala on March 15.
On this occasion, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi reaches Narayangiri Gardens in a procession at 6 pm.
Later, the artists of the Annamacharya Project renders Saptagiri Sankeertana Gosthi Ganam.
Later, the Utsava deities returns to the temple.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 15న తిరుమలలో తాళ్లపాక అన్నమయ్య 523వ వర్థంతి మహోత్సవం
తిరుమల, 2026 మార్చి 12: పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 523వ వర్థంతి మహోత్సవాన్ని మార్చి 15న తిరుమలలో టీటీడీ నిర్వహించనుంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
