POURNAMI GARUDA SEVA ON MARCH 18 _ మార్చి 18న పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 17 Mar. 22: Pournami Garuda Seva on March 18. As part of ongoing tradition TTD is organising Pournami Garuda Vahana Seva on March 18, being Phalguna Pournami.

It is well known that Garuda Vahana Seva is performed every month on the Pournami day at night between 7.00-9.00 pm a richly adorned Utsava idol of Sri Malayappa Swamy riding holy Garuda Vahana will be paraded on the Mada streets to bless the devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 18న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2022 మార్చి 17: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 18న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు పాల్గుణ పౌర్ణ‌మి కావ‌డం విశేషం.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.