BRAHMOTSAVAMS OF SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE AT TARIGONDA FROM MARCH 2-10 _ మార్చి 2 నుండి 10వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 9 February 2020: TTD will be organising the grand annual Brahmotsavams of Sri Lakshmi Narasimha Swamy temple at Tarigonda from March 2-10 with Ankurarpanam on March 1.
Following are details of events: Dwajarohanam on March 2, Kalpavruksha vahanam on March 4, Kalyanotsavam and Garuda vahanam on March 7, Paruveta utsavam on March 9, and finally Vasantotsavam, chakra snanam and Dhwajavarohanam on March 10 and Pushpayagam on March 11.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 2 నుండి 10వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 09: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
02-03-2020(సోమవారం) ధ్వజారోహణం హంసవాహనం,
03-03-2020(మంగళవారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
04-03-2020(బుధవారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం
05-03-2020(గురువారం) తిరుచ్చి ఉత్సవం పెద్దశేష వాహనం
06-03-2020(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం గజవాహనం
07-03-2020(శనివారం) తిరుచ్చి ఉత్సవం సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం, గరుడ వాహనం
08-03-2020(ఆదివారం) రథోత్సవం ధూళి ఉత్సవం
09-03-2020(సోమవారం) సూర్యప్రభవాహనం చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం,అశ్వ వాహనం
10-03-2020(మంగళవారం) వసంతోత్సవం, చక్రస్నానం ధ్వజావరోహణం
కాగా, మార్చి 7వ తేదీ రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మార్చి 11వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.