ARADHANA MAHOTSAVAM OF SRI VYASARAYA & VAIDRAJA THIRTHAS _ మార్చి 20 నుండి 22వ తేదీ వరకు తిరుమలలో శ్రీ వ్యాసరాజ తీర్థులు మరియు శ్రీ వాదిరాజ తీర్థుల ఆరాధన మహోత్సవాలు
Tirumala, 10 Mar. 22: Under the auspices of its Dasa Sahitya project, TTD is organising the Aradhana Mahotsavam of prominent Carnatic musical saints Sri Vyasaraja Thirtha and Sri Vadiraja Thirtha at Tirumala from March20-22 at the Asthana Mandapam.
Dasa Sahitya Project Special Officer Dr PR Anandatheerthacharyulu is supervising the arrangements.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి 20 నుండి 22వ తేదీ వరకు తిరుమలలో శ్రీ వ్యాసరాజ తీర్థులు మరియు శ్రీ వాదిరాజ తీర్థుల ఆరాధన మహోత్సవాలు
తిరుమల, 2022 మార్చి 10: ప్రముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలైన శ్రీ వ్యాసరాజ తీర్థులు మరియు శ్రీ వాదిరాజ తీర్థులు ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 20 నుండి 22వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో జరుగనుంది.
మార్చి 20, 21వ తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ వ్యాసరాజ తీర్థులు మరియు శ్రీ వాదిరాజ తీర్థుల సంకీర్తనలు పారాయణం చేస్తారు. మార్చి 22న ఉదయం సుప్రభాతం, భక్తి సంగీత కార్యక్రమాలతో ఆరాధన మహోత్సవాలు ముగుస్తాయి.
శ్రీ వ్యాసరాజ తీర్థులు :
శ్రీ వ్యాసరాజ యతీశ్వరులు 12 సంవత్సరాలు తిరుమల క్షేత్రంలో ఉండి శ్రీవారిని అర్చిస్తూ వేలాది సంకీర్తనలు రచించారు.
శ్రీ వాదిరాజ తీర్థులు :
శ్రీ కృష్ణదేవరాయుల రాజగురువైన శ్రీ వ్యాసరాజ యతీశ్వరుల వద్ద ఆయన శిష్యరికం చేశారు. మధ్వాచార్యుల ద్వైత తత్వశాస్త్రంలో అత్యంత ప్రసిద్ధ పండితుడు, తత్వవేత్తలలో ఒకరు. శ్రీ వాదిరాజ తీర్థులు భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శంచి తీర్థ ప్రబంధమనే గ్రంథాన్ని రచించారు.
తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.