ANNUAL BTU OF SRI KRT FROM MARCH 23-31 _ మార్చి 23 నుండి 31వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 26 Feb. 20: The annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple will begin from March 23- 31 with Ankurarpanam on March 22.
The important days during Brahmotsavams includes Dwajarohanam on March 23, Kalpavruksha-March 25,
Garuda -27, Rathotsavam on March 30 and Chakra snanam on March 31.
Ahead of Brahmotsavams the TTD is performing the holy temple cleaning, Koil Alwar Thirumanjanam on March 20.
The artists of cultural wings of TTD HDPP, Annamacharya Project and Dasa Sahitya Project will present bhajans, kolatas and harikatha s o. All days of Brahmotsavams.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 23 నుండి 31వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 26: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 23 నుండి 31వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 22వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తేదీ ఉదయం సాయంత్రం
23-03-2020(సోమవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
24-03-2020(మంగళవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
25-03-2020(బుధవారం) సింహ వాహనం ఉగాదిఆస్థానం/ ముత్యపుపందిరి వాహనం
26-03-2020(గురువారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
27-03-2020(శుక్రవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
28-03-2020(శనివారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం
29-03-2020(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
30-03-2020(సోమవారం) రథోత్సవం అశ్వవాహనం
31-03-2020(మంగళవారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
మార్చి 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 20వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 6.30 నుండి 9.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 10.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.