మార్చి 24 నుండి 28 వరకు శ్రీవేదనారాయణస్వామివారి ఆలయంలో సూర్యపూజోత్సవం

మార్చి 24 నుండి 28 వరకు శ్రీవేదనారాయణస్వామివారి ఆలయంలో సూర్యపూజోత్సవం

 తిరుపతి, 2010 మార్చి 23: నాగలాపురంలో వున్న శ్రీవేదనారాయణస్వామి వారి ఆలయంలో మార్చి 24 నుండి 28 వరకు సూర్యపూజోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆలయానికి ఎదురుగా వున్న పుష్కరిణినందు మార్చి 26 నుండి 28 వరకు మూడు రోజుల పాటు తెప్పోత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం సందర్భంగా సాయంత్రం 6.30 గంటల నుండి 9.30 గంటల వరకు అన్నమాచార్య కళాకారులచే అన్నమయ్య కీర్తనల ఆలాపన, హిందూధర్మ ప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో హరికథ, భజనలు ఏర్పాటు చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.