522ND DEATH ANNIVERSARY OF SRI THALLAPAKA ANNAMACHARYA FROM MARCH 25 – 29 _ మార్చి 25 నుండి 29వ తేదీ వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 522వ వర్ధంతి ఉత్సవాలు
మార్చి 25 నుండి 29వ తేదీ వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 522వ వర్ధంతి ఉత్సవాలు
– మార్చి 25న మెట్లోత్సవం
తిరుపతి, 2025 మార్చి 19: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 522వ వర్థంతి ఉత్సవాలు మార్చి 25 నుండి 29వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు.
మార్చి 25వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. మార్చి 26న తిరుమలలో సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహిస్తారు.
మార్చి 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.