KOIL ALWAR IN GT ON MARCH 27_ మార్చి 27న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATI, 26 MARCH 2025: The Koil Alwar Tirumanjanam in the ancient temple of Sri Govindaraja Swamy in Tirupati will be held with utmost devotion on Thursday.
This traditional temple cleansing ritual will be observed in connection with Telugu Ugadi Asthanam in the temple on March 30.
Temple officials will participate in this Alaya Suddhi fete.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 27న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2025 మార్చి 26: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 30వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మార్చి 27వ తేదీ తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
మార్చి 30న ఉగాది ఆస్థానం :
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మార్చి 30న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది.
ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరుగనుంది.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.