UGADI FESTIVITIES IN LOCAL TEMPLES _ మార్చి 30న టిటిడి స్థానిక ఆలయాల్లో ఉగాది వేడుకలు
Tirupati, 28 March 2025: The sub-temples of TTD are gearing up to celebrate Ugadi festivities on March 30.
Tiruchanoor, Govindaraja Swamy, Kodanda Ramalayam, Srinivasa Mangapuram are sprucing up to match the occasion.
Besides, Karvetinagaram, Appalayagunta are also getting ready to observe the Telugu New Year’s day.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 30న టిటిడి స్థానిక ఆలయాల్లో ఉగాది వేడుకలు
తిరుపతి, 2025 మార్చి 28: టిటిడి స్థానిక ఆలయాల్లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా జరుగనుంది.
అనంతరం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో :
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు.
శ్రీ కోదండరామాలయంలో :
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేయనున్నారు.
కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో :
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు ఆలయంలో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం ర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట :
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు పంచాంగ శ్రవణం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.