KAT IN GT _ మార్చి 31న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATI, 29 MARCH 2022: Koil Alwar Tirumanjanam will be observed in Sri Govindaraja Swamy temple at Tirupati on Thursday in connection with Subhakrutnama Ugadi.
This ritual will be observed between 7am and 9am on March 31.
On April 2 Ugadi Asthanam will be performed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 31న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2022 మార్చి 29: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 31వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మార్చి 31వ తేదీ తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
ఏప్రిల్ 2న ఉగాది ఆస్థానం :
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది.
ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరుగనుంది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.