VONTIMITTA SRI KODANDARAMA SWAMY TEMPLE MAHASAMPROKSHANAM FROM MARCH 5 – 9 – JEO _ మార్చి 5 నుండి 9వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ : జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం
Tirupati, 11 February 2025: TTD JEO Sri. Veerabraham said that the Maha Samprokshanam program will be organized from March 5th to 9th at Vontimitta Sri Kodandarama Swamy temple.
A review was conducted by JEO with the officials concerned on Tuesday regarding the ongoing renovation works and Brahmotsavam arrangements to be carried out.
Speaking on this occasion, JEO said that “Balalayam” was organized from 6th to 8th September last.
He said that restoration works are being carried out in the temple under the auspices of the Archeology Department of India.
He asked the TTD officials to complete the restoration works of the temple on time.
Maha Samprokshanam will be organized in the temple from March 5 to 9 and the devotees will be given darshan of Moolamurthy. He said that Swami’s Brahmotsavam will be organized in a grand manner in coordination with the Kadapa district administration.
For this, it was explained that a review of Brahmotsavam will be conducted soon with the district officials.
The JEO conducted a review with the officers of all departments on the arrangements for the annual Brahmotsavams to be held in the month of April.
Keeping in mind the Brahmotsavams, arrangements should be made to make the devotees comfortable in the background of summer.
After that, JEO inspected the development works in the Kalyana venue along with the officials and made several suggestions.
CE Sri. Satyanarayana, SE (Electrical) Sri Venkateswarlu, Deputy EO Sri Natesh Babu, VGO Smt. Sadalakshmi and other department officers participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 5 నుండి 9వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ : జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 11: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 5 నుండి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రక్తంగా నిర్వహించనున్నట్లు టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం చెప్పారు. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో జరుగుతున్న జీర్ణోదరణ మరమ్మత్తు పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం జేఈవో అధికారులతో ఒంటిమిట్టలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం గత ఏడాది సెప్టెంబరు 6 నుండి 8వ తేదీ వరకు ”బాలాలయం” నిర్వహించినట్లు తెలిపారు. భారత పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సకాలంలో ఆలయ పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని టిటిడి అధికారులను కోరారు.
మార్చి 5 నుండి 9వ తేదీ వరకు ఆలయంలో మహా సంప్రోక్షణ నిర్వహించి, భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించనున్నట్లు తెలియజేశారు. కడప జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం త్వరలో జిల్లా అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు.
ఒంటిమిట్ట ఆలయ పునరుద్ధరణ పనులు, ఏప్రిల్ నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని వేసవి నేపథ్యంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అనంతరం జేఈవో ఆలయంలో జరుగుతున్న మరమ్మత్తు పనులు, కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ సత్యనారాయణ, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీ పి.వి.నటేష్ బాబు, విజిఓ శ్రీమతి సదాలక్ష్మి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.