మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
తిరుపతి, 2010 మార్చి 06: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుగుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగబాధ్యతలను నిర్వర్తిస్తూ విశేష ప్రతిభ కనబరిచిన పలువురి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు స్థానిక మహతి ఆడిటోరియంలో తితిదే అధికారులచే పురస్కారాలు అందజేయబడుతాయి.
విధి నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన 5 మందిని ఎంపిక చేసి వీరిలో 2010-2011 సంవత్సరంలో పదవీ విరమణ చేయు ముగ్గరికి 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలరు, పట్టు సాలువ, సర్టిఫికెట్, జ్ఞాపికతో సత్కరిస్తారు. మిగిలిన ఇద్దరికి పట్టు సాలువ, సర్టిఫికెట్, జ్ఞాపికను అందజేస్తారు. అదేవిధంగా వివిధ విభాగాలలో పనిచేయు 25 మందిని ఎంపిక చేసి అందులో 2010-2011 సంవత్సరంలో పదవీ విరమణ చేయు 15 మందికి 2 గ్రాముల శ్రీవారి బంగారు డాలరు, పట్టు సాలువ, సర్టిఫికెట్, జ్ఞాపికతో సత్కరిస్తారు. మిగిలిన 10 మందికి పట్టు సాలువ, సర్టిఫికెట్, జ్ఞాపికను అందజేస్తారు.
ప్రతి ఎడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళ ఉద్యోగులను సత్కరించడం తితిదేలో క్రమం తప్పకుండా జరుగుతున్నది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.