WORLD WOMEN’S DAY AT MAHATHI ON MARCH 08 _ మార్చి 8న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Tirupati, 07 March 2021: TTD is organising day-long international Women’s Day celebrations at Mahati auditorium on Monday.

The programs will kick off with inspiring speeches by eminent women achievers Smt Ramaa Raavi, Smt Sai Prasanna Ravishankar and international athlete Smt Korda Mrudula.

Thereafter TTD women employees who excelled in their services will be presented Padmavati awards followed by awards and felicitations retired women employees and 60 women employees who are retiring soon.

TTD welfare DyEO Sri Anandraj is supervising all arrangements.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 8న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తిరుపతి, 2021 మార్చి 07: టిటిడి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది.

ఉదయం 10 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సందర్భంగా ప్రముఖ వక్తలు శ్రీమతి రమా రావి, శ్రీమతి సాయిప్రసన్న రవిశంకర్, అంతర్జాతీయ అథ్లెట్ కోరాడ మృదుల ప్రసంగిస్తారు.

అదేవిధంగా, టిటిడిలో విశేష సేవలందిస్తున్న ఆరుగురు మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డు ప్రదానం చేస్తారు. టిటిడిలో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ఐదుగురు మహిళలకు సన్మానం, 2021 మార్చి నుండి 2022 ఫిబ్రవరి వరకు పదవీ విరమణ పొందనున్న 60 మంది మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.