EO INSPECTS ARRANGEMENTS _ ముఖ్యమంత్రివర్యుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో

TIRUPATI, 04 MAY 2022: TTD EO Dr KS Jawahar Reddy inspected the arrangements at Children’s and Cancer Care hospitals on Wednesday night.

As both the SP Children’s and SV Cancer Care hospitals are set to be inaugurated by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on May 5, he inspected the arrangements.

The EO visited the SP Children’s Hospital site where foundation stone and Bhoomi Puja will be performed. He also inspected the 2D and 3D model plans put for display.

Later he visited the TATA Cancer Care Hospital and inspected the seating arrangements in the lobby where in CM will be shown a short documentary about the hospital.

Director Dr Ramanan said the Pink Bus used to diagnose the patients will be arranged outside.

Additional EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Additional CVSO Sri Siva Kumar Reddy, CE Sri Nageswara Rao and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ముఖ్యమంత్రివర్యుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో

మే 04, తిరుపతి 2022: ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి టిటిడి పరిధిలో చేపట్టనున్న శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి బుధవారం రాత్రి పరిశీలించారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ముందుగా శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. పూజ నిర్వహించే ప్రదేశం, ఆసుపత్రి నిర్మాణం, కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలతో రూపొందించిన వీడియో విజువల్స్ ను పరిశీలించారు. ఆసుపత్రి ప్లాన్ కు సంబంధించిన 2డి ప్లాన్, 3 డి మోడల్ ను చూశారు. పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం టాటా క్యాన్సర్ హాస్పిటల్ ను ఈఓ పరిశీలించారు. వీడియో విజువల్స్ ను, ప్రముఖులు కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాట్లను చూశారు. ఆసుపత్రిలో సీఎం సందర్శించే ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఉపయోగించే పింక్ బస్సును ఆస్పత్రి వెలుపల ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ డాక్టర్ రమణన్ తెలియజేశారు.

ఈవో వెంట అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, సీఎం సలహారులు డా. హరికృష్ణ, డా. చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.