COMPETITIONS HELD _ ముగిసిన మహిళా ఉద్యోగుల పోటీలు
TIRUPATI, 02 MARCH 2023: In connection with International Women’s Day on March 8, the Welfare department of TTD held competitions for the women employees of TTD.
Many women participated in the painting, essay writing, quiz and singing competitions held at SV Oriental College and SV College of Music and Dance.
Dy EO Welfare Smt Snehalata and her staff members with the assistance of Committee members supervised the arrangements.
ముగిసిన మహిళా ఉద్యోగుల పోటీలు
తిరుపతి 2 మార్చి 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వివిధ పోటీలు గురువారం ముగిశాయి.
శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన, పాటల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం డిప్యూటి ఈవో శ్రీమతి స్నేహలత పర్యవేక్షణలో నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీమతి శైలజ, శ్రీమతి సంగీత లక్ష్మి వ్యవహరించారు. సంగీత, నృత్య కళాశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ సుధాకర్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది