AFTER 62 DAYS YOGA VASISHTYAM CONCLUDES _ ముగిసిన “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం

SUNDARAKANDA TO COMMENCE FROM JUNE 11

PROGRAMME BECOMES POPULAR AMONG SRIVARI DEVOTEES ACROSS THE GLOBE

ALL MANTRAS AVAILABLE ON TTD WEBSITE

Tirumala, 10 Jun. 20: The Yoga Vasishtyam and Dhanwantari Maha Mantra Parayanam, devotional programme mulled by TTD is aimed at to weed off Corona COVID 19 virus from the entire world and resume darshan of Sri Venkateswara Swamy at Tirumala, has won the hearts of millions and millions of devotees across the globe.

The programme designed by Additional EO of TTD and SVBC MD Sri AV Dharma Reddy which commenced on April 10, in the Nada Neerajanam platform at Tirumala, continued for 62 days and concluded on Wednesday. The Principal of Dharmagiri Veda Vignana Peetham at Tirumala, Sri KSS Avadhani carried out the programme with finesse with Mantra Parayanam which was telecasted live by Sri Venkateswara Bhakti Channel of TTD every day between 7am and 8am.

Apart from the Yoga Vasishtyam and Dhanwantari Maha Mantra Parayanam, every day, one Mantram invoking the blessings of one deity who is considered auspicious for that week day was also recited including Gayatri Stotram, Harinama Maala Stotram, Garuda Dandakam, Anjaneya Navarathnamala, Dakshinamurthy Varnamala Stotram, Sri Goda Stuti, Kamalajadayitastakam, Hayagreeva kavacham, Sudarshana Stotram, Sri Stuthi, Sri Varaha Kavacham, Sri Venkateswara Saranagati Stotram etc. were rendered on each day on all these 62 days.

Each day one department in TTD took part in this Parayanam. Tirumala locals also took part in this programme. All the guidelines of COVID 19 were strictly observed during the seating arrangements in the Nada Neerajana Mandapam. TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri P Basant Kumar, heads of various departments participated in this programme on each day.

On the last day of Yoga Vasishtyam, the artists of Annamacharya Project of TTD participated and rendered melodious notes of Saint Poet Sri Tallapaka Annamacharya and raised spiritual fervour among the participants by reciting Govinda Namas in a vibrant manner. TTD Asthana Vidhwan Dr G Balakrishna Prasad, senior artists Dr G Madhusudhana Rao, Sri Raghunath, Smt Bullemma rendered Annamacharya Sankeertans and Namas. TTD Trust Board Member Sri Vaidyanathan Krishnamurthy, Annamacharya Project Director Sri S Dakshinamurthy were also present. 

MANTRA MAALAS ON WEBSITE

Seeing the unprecedented reception from devotees present across the world, TTD has placed all the Mantra Malas recited during the last 62 days in its official website for the ease of the devotees.  

SUNDARAKANDA PARAYANAM

As the Darshan for pilgrims is set to resume on June 11, TTD has now planned to recite the popular “Sundarakanda Stotra Manjari” from Thursday onwards. Sundarakanda is usually recited for restoring peace and harmony on the domestic front and also to remove negative forces and protects against diseases ensuring good health and overcoming financial crises. This programme will also be live telecasted by SVBC between 7am and 8am from Nada Neerajana Mandapam at Tirumala.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ముగిసిన “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం

62 రోజుల పాటు ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం
భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌
జూన్ 11 నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం

 తిరుమ‌ల‌, 2020 జూన్ 10: ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయ‌ణం ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వ‌ర‌కు 62 రోజుల పాటు కొన‌సాగి బుధ‌వారం ముగిసింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన ఈ కార్య‌క్ర‌మాన్ని తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ విదేశాల్లోని భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో అనుస‌రించి త‌మ ఇళ్లలో పారాయ‌ణం చేశారు. విశ్వ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల నుండి ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భించింది.

తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై ప్ర‌తిరోజూ ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌‌కు ఈ పారాయ‌ణం జ‌రిగింది. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి ఇత‌ర విభాగాధిప‌తులు ఈ పారాయ‌ణంలో పాల్గొన్నారు. ఈ పారాయ‌ణం 60వ రోజుకు చేరుకోగానే తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌యోగాత్మ‌కంగా స్వామివారి ద‌ర్శ‌నం ప్రారంభమైంది. చివ‌రి రోజైన బుధ‌వారం శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ ద‌క్షిణామూర్తి ఆధ్వ‌ర్యంలో గోవింద‌నామాల పారాయ‌ణం అద్భుతంగా జ‌రిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌, శ్రీ గుర‌జాడ మ‌ధుసూద‌న‌రావు, శ్రీ ర‌ఘునాథ్‌, శ్రీ‌మ‌తి బుల్లెమ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

జూన్ 11 నుండి సుంద‌ర‌కాండ పారాయ‌ణం

తిరుమ‌ల‌లో జూన్ 11వ తేదీ నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభం కానుంది. ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌‌కు జ‌రుగ‌నున్న ఈ పారాయ‌ణాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.