TEPPOTSAVAMS CONCLUDES _ ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
TIRUPATI, 16 FEBRUARY 2022: The annual Teppotsavams in Sri Govinda Raja Swamy Temple in Tirupati concluded on Wednesday.
Due to covid restrictions the seven day Annual festival was conducted in Ekantam.
On the last day of the religious event, the processional deities of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi were seated on Tiruchi to bless devotees.
Earlier, during the day Snapana Tirumanjanam was performed to the deities.
Spl Gr DyEO Sri Rajendrudu and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి, 2021 ఫిబ్రవరి 16: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏడు రోజుల పాటు ఏకాంతంగా జరిగిన తెప్పోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ ప్రాంగణంలో ఊరేగి కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీరాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎపి. శ్రీనివాస దీక్షితులు, సూపపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కామరాజు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.