PURANDARADASA ARADHANA FESTIVAL CONCLUDES _ ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

Tirumala, 30 January 2025: Kannada Sangeeta Pitamaha Sri Purandardasa Aradhana Mahotsavams, observed under the auspices of the Dasa Sahitya Project of TTD concluded in Tirumala on a grand note on Thursday at Asthana Mandapam.

The Special Officer of the Dasa Sahitya Project Sri. Ananda Theerthacharyulu said  Sri Purandara Dasa who was actually the incarnation of Narada, penned and composed 4.75 lakh Sankeertans during his lifetime.  

He said Purandardasa’s hymns are universal and immortal.

The life of Sri Purandardasa is exemplary for humanity, he maintained.

Thousands of Bhajan Mandali members from the states of Andhra, Telangana and Karnataka participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు

తిరుమల. 2025 జనవరి 30: తిరుమలలో గత మూడురోజులుగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు గురువారంనాడు ఆస్థాన మండ‌పంలో ఘనంగా ముగిశాయి.

దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, మాన‌వ జీవ‌న విధానంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు పూర్వ‌జ‌న్మ క‌ర్మ ఫ‌ల‌మే కార‌ణ‌మ‌న్నారు. దీని నుండి బ‌య‌ట ప‌డ‌టానికి మ‌హ‌త్ముల‌ను సంద‌ర్శించి వారి మార్గ‌ద‌ర్శ‌కంలో భ‌గ‌వంతుడిని సేవించ‌డం ద్వారా మోక్షం పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

అదేవిధంగా శ్రీ‌ తన జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుల వారికే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.