GAJENDRA VARADA BLESSES DEVOTEES _ ముత్యపుపందిరిపై గజేంద్ర వరదుడుగా అలమేలుమంగ
TIRUPATI, 12 NOVEMBER 2023: Sri Padmavathi Devi as Gajendra Varada blessed Her devotees on Mutyapu Pandiri Vahanam on Sunday on the third day of ongoing annual Brahmotsavams at Tiruchanoor.
The Pontiffs of Tirumala, TTD Chairman Sri Karunakara Reddy, board member Sri Mohit Reddy, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ముత్యపుపందిరిపై గజేంద్ర వరదుడుగా అలమేలుమంగ
తిరుపతి, 2023 నవంబర్ 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ మహా విష్ణువు అలంకారంలో గజేంద్ర మోక్షం ఘట్టంతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం.
మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, గంధంతో అభిషేకం చేస్తారు.
కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విఎస్‌వో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.