SRI PRASANNA VENKATESWARA ON PEARL PALLAKI AS VENUGOPALA SWAMY _ ముత్యపు పందిరి వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

Tirupati, 09 June 2025: As part of the ongoing annual Brahmotsavams at Appalayagunta, Sri Prasanna Venkateswara Swamy was adorned as Venugopala Swamy and blessed devotees atop the Simha Vahanam on Monday night.

The Vahana Seva began at 7 PM, with devotees offering camphor harathi and having darshan of the deity.

Earlier, at 5 PM, the deity was brought to the Unjal Mandapam, and Unjal Seva was held from 5.30 to 6.30 PM.

On Tuesday morning at 8 AM, the deity will ride the Kalpavriksha Vahanam to bless the devotees.

Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt. Srivani, Temple Inspector Sri Shivakumar, priests, Srivari Sevaks, and devotees participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ముత్యపు పందిరి వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

తిరుపతి, 2025, జూన్ 09: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి వేణుగోపాలస్వామి స్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సాయంత్రం 5 గం.లకు ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. అనంతరం సా. 5.30 – 6.30 గం.ల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు.

మంగళవారం ఉదయం 8 గం.లకు కల్పవృక్ష వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.

వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.