‌CULTURAL MARVEL IN BRAHMOTSAVAMS _ ముత్యపుపందిరి వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

TIRUPATI, 12 NOVEMBER 2023: The third day of the ongoing annual brahmotsavams in Tiruchanoor witnessed a grand display of fine arts by cultural teams before Mutyapu Pandiri Vahanam on Sunday.

The students of SV College of Music and Dance performed dance ballets for Annamacharya Sankeertans, Rudra Natyam, Chamundeswari Pahimam dances by Chennai troupes steal the show besides Tappetagullu, Kolatam etc.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ముత్యపుపందిరి వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2023 నవంబరు 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉద‌యం ముత్యపుపందిరి వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలిచ్చాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 12 కళాబృందాల్లో కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శనలతో అలరించారు.

తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు పలు అన్నమయ్య సంకీర్తనలకు చక్కటి నృత్య ప్రదర్శన చేశారు. కూచిపూడికి చెందిన శ్రీ వైష్ణవి నృత్యాలయం కళాకారులు కూచిపూడి నృత్యం, చెన్నైకి చెందిన నృత్యగిరి పాఠశాల కళాకారులు శ్రీ చాముండేశ్వరి పాహిమాం అంశాన్ని నృత్యప్రదర్శనతో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారు.

బెంగళూరుకు చెందిన నాట్యేశ్వర నృత్యశాలకు చెందిన కళాకారులు భరతనాట్యం, నటనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ కళాకారులు సంప్రదాయ నృత్యం, నాట్యాంకుర పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కళాకారులు భజగోవిందం నృత్యరూపకాన్ని ఆకట్టుకునేలా ప్రదర్శించారు.

తమిళనాడుకు చెందిన భారత కళా అకాడమీ ట్రస్ట్ కళాకారులు రుద్రనాట్యం, ఉరుములు, భరతనాట్యాన్ని ఆకట్టుకునేలా ఆవిష్కరించారు. తిరుపతికి చెందిన కవిత బృందం గోపికానృత్యాన్ని చూడచక్కగా ప్రదర్శించారు. వీటితోపాటు కోలాటాలు, తప్పెటగుళ్లు తదితర కళారూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి శ్రీ రాజగోపాల్ రావు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఏఈవో శ్రీ శ్రీరాములు కళాబృందాలకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.