MALAYAPPA SHINES IN PEARL ARMOUR _ ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప

Tirumala, 20 June 2024: The annual Jyestabhishekam entered the second day on Thursday in Tirumala temple.

In the morning Snapana Tirumanjanam was performed to the Utsavam deities while in the evening the Muryapu Kavacham-the pearl studded armour was adorned to Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi.

Later the utsava deities blessed the devotees in the Mutyapu Kavacham.

HH Sri Pedda Jeeyar Swamy and HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, temple DyEO Sri Lokanatham and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప

తిరుమ‌ల‌, 2024 జూన్ 20: తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు గురువారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు.

అంతకుముందు ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.

సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.