INTEGRITY OF ARTFORMS DISCOVERED _ ముత్యపు పందిరి వాహనసేవలో కళానీరాజనం
TIRUMALA, 06 OCTOBER 2024: The ongoing annual Brahmotsavams have been witnessing a great gala cultural integrity with artistes from several states performing during vahana sevas.
On Sunday evening a total of 20 art troupes and 541 artists presented their works of art in front of the Pearl Canopy Vahana Seva.
The Sri Krishnaavatara Rupakam, Dashavatara Mahotsavam, Sri Narasimhodbhava Ghattam, besides many art forms captivated the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముత్యపు పందిరి వాహనసేవలో కళానీరాజనం
తిరుమల, 2024 అక్టోబరు 06: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనసేవలో వివిధ రాష్ట్రల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 20 కళాబృందాలు, 541 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.
ఆంధ్ర రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పంజాబ్, కర్నాటక రాష్టాలకు చెందిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులకు నయనానందంతోపాటు మనోరంజకంగా సాగింది.
మణిపూర్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రలకు చెందిన జానపద సంప్రదాయ నృత్యాలు అలరించాయి. తిరుపతికి చెందిన డా. మురళీ కృష్ణ బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణావతారం రూపకం, బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ బృందం ప్రదర్శించిన దశావతార మహోత్సవం, విశాఖపట్నంకు చెందిన మర్రి లలితా బృందం ప్రదర్శించిన శ్రీ నరసింహోద్భవ ఘట్టం, మధ్యప్రదేశ్ రాష్టానికి చెందిన హర్సింగ్ వర్మ ప్రదర్శించిన గిరిజన జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన అబ్బురపరిచినది. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, మచిలీపట్నం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.